Swathi Mutyam: వర్ష బొల్లమ్మ చారెడు కళ్ళను చదివేస్తున్న గణేశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి , ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం’ లోని గీతం కూడా అలానే అనిపిస్తోంది. ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ గణేశ్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం ఈ రోజు విడుదల అయింది. ”నాయిక వర్ష బొల్లమ్మతో ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా… నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా’ సాగిన ఈ పాటను కెకె రాయగా, అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వరసాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం. గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్.
గీత రచయిత కె.కె. మాట్లాడుతూ, ”ప్రతి పాటకు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది. అలాగే ఈ పాటలో ‘ఓ… తారల్ని మూట కడతా నీ కాలి ముందు పెడతా అరె.. చందమామకి నీకూ తేడా లేదుగా మబ్బుల్ని తెచ్చి కుడతా రెక్కల్ని చేసి పెడతా మేఘాలు దాటి పదా ఆ ఆకాశం అంచుకే చేరదాం’ అనే పదాలు, పాట పల్లవి నాకెంతో ఇష్టం” అని అన్నారు.
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు "పెద్ది" దెబ్బ.... విదేశాల్లోనూ షాకే!
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారం ఊపందుకుంటోంది. నాగవంశీ మాట్లాడుతూ, ”ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో చిత్రం సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయన్న వార్తలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి” అని చెప్పారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!