NBK X PSPK Power Teaser: అన్‌స్టాపబుల్ ప్రశ్నలతో పవన్‌కి బాలయ్య ఫిట్టింగ్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK X PSPK Power Teaser From Unstoppable With NBK S2 Released: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేసిన ఎపిసోడ్‌కి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. తొలుత సెట్స్‌లోకి పవన్ అడుగుపెట్టేటప్పుడు ఫ్యాన్స్ చేసే హంగామా దగ్గర నుంచి మొదలయ్యే ఈ టీజర్.. చివర్లో తామిద్దరం బ్యాడ్ బాయ్స్ అంటూ బాలయ్య చెప్పే కొంటే మాటతో ఇది ముగుస్తుంది. ఇక బాలయ్య తన షోలో అడిగే ప్రశ్నలు ఎంత భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయో అందరికీ తెలుసు! ఆయా సెలెబ్రిటీలకు తగ్గట్టు.. సరదా ప్రశ్నలతో పాటు వివాదాస్పద అంశాలపై కూడా వివరాల్ని రాబడతారు.
Crime News: పార్కింగ్ ప్లేస్ గొడవ.. కత్తులతో దాడి చేసుకున్న రౌడిషీటర్లు
Also Read
ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన టీజర్‌ని బట్టి చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ విషయంలోనూ బాలయ్య అదే ఫార్ములాని ఫాలో అయినట్టు తెలుస్తోంది. రాజకీయ, వ్యక్తిగత ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. తొలుత అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నదేంటి? వద్దనుకున్నవేంటి? అనే ప్రశ్న వేసి పవన్‌ని ఇరుకున పడేశారు. అనంతరం ఏపీలో భారీ అభిమానగణం ఉన్నప్పటికీ, అది ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదంటూ మరో ఫిట్టింగ్ పెట్టేశారు. చూస్తుంటే.. ఈ షోలో ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నల్ని బాలయ్య బాగానే సంధించినట్టు అర్థమవుతోంది. ఇంతేకాదండోయ్.. బాలయ్య మార్క్ కామెడీ, దానికి ధీటుగా పవన్ కామిక్ టైమింగ్స్ కూడా అదిరాయి. ఈమధ్య విమర్శల్లో వాడీవేడీ పెరిగిందని బాలయ్య పేర్కొనగా.. లేదు, తాను చాలా పద్ధతిగానే మాట్లాడుతానని పవన్ ఇచ్చిన బదులుని బట్టి, ఈ ఎపిసోడ్‌లో ఎంటర్టైన్‌మెంట్‌కి కూడా ఢోకా ఉండదని స్పష్టమవుతోంది.
Mahesh Babu: మహేశ్ కోసం రంగంలోకి దిగిన ‘క్రూరమైన విలన్’
https://www.youtube.com/watch?v=NhadAnD5aqI
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!