NBK109: సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK109:నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరుతో పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.అదే ఊపు లో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ 109 వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక టైటిల్ గా NBK109 అనే చూపించడం విశేషం.. NBK అంటే నేచురల్ బోర్న్ కింగ్ (natural born king) అని చెప్పుకొచ్చారు.
ఇక గ్లింప్స్ విషయానికొస్తే బాలయ్య ఊచకోత మరోసారి కనిపించింది. బాలయ్యను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో చూడాలనుకున్నారో.. బాబీ ఆ రేంజ్ లోనే చూపించాడు. అడవిలో కార్చిచ్చు మధ్య.. నటసింహం కారులో నుంచి దిగడం.. బాక్స్ ఓపెన్ చేయడం మ్యాన్షన్ హౌస్ కనిపించడమే హైలైట్ గా మారింది అనుకుంటే.. బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో అదరకొట్టాడు. అడివి మధ్యలో విలన్స్ ను చితకబాదుతూ.. సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ .. హంటింగ్ అంటూ పవర్ ఫుల్ గా చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య సినిమా అంటే చాలు థమన్ డ్యూటీ ఎక్కేస్తాడు. గ్లింప్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి టైటిల్ అదేనా, వేరే ఇంకేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. 'లెనిన్' విషయంలో ఏం జరిగింది?
- Balakrishna - Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
- Raaka: 'రాకా' కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
- Lenin Success Meet : అఖిల్ 'లెనిన్' గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!