బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఎక్కువగా వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో నయన్ ఇదివరకు ‘రాజా రాణి’, ‘బిగిల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ బాలీవుడ్ లో సినిమా చేయలేదు. అయితే తన హిందీ మొదటి సినిమాకే నయన్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. రీసెంట్ గా నయన్ తో చర్చలు జరిగిన మేకర్స్ ఆమె డిమాండ్ మేరకు 5 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా నయన్ దక్షిణాది సినిమాలో 2-3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.