Nayakudu Trailer: నాయకుడు ట్రైలర్.. వడివేలు నట విశ్వరూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayakudu Trailer: ఒక భాషలో హిట్ అందుకున్న సినిమాను.. తెలుగులో రిలీజ్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారంలా మారిపోయింది. అయితే రీమేక్, లేకపోతే డబ్బింగ్.. ఎలా అయినా ఒక మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని మేకర్స్ కంకణం కట్టుకున్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ ముందు ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ ప్రొడక్షన్స్ తాజాగా మరో సినిమాను టాలీవుడ్ కు అందిస్తుంది. అదే నాయకుడు. తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. వీరితో పాటు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా చేయి కలిపింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ మధ్యనే తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను జూలై 14 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. తాజాగా తెలుగు ట్రైలర్ ను మహేష్ బాబు చేత రిలీజ్ చేయించారు.
Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక దళిత ఎమ్మెల్యే కొడుకుగా ఉదయనిధి స్టాలిన్ నటించాడు. రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకొనేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన వడివేలు.. ఈ సినిమాలో సీరియస్ గా కనిపించి నట విశ్వరూపం చూపించాడు. “నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పాడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను” అంటూ వడివేలు వాయిస్ తో మొదలైన ట్రైలర్.. గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఇక విలన్ గా ఫహద్ ఫాజిల్ నటన అద్భుతమని చెప్పాలి. దళితులును.. ఊరిలోకి వస్తే కఠినంగా చంపేసే గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ దళితుల కోసం ఎమ్మెల్యే నుంచి ముఖ్యంమత్రిగా ఒక తండ్రి ఎలా మారాడు. ఆ తండ్రి ఉద్యమానికి కొడుకు ఏ విధంగా సపోర్ట్ చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ చేసింది. కెమరా పనితనం, నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి. మరిసెల్వరాజ్ ‘నాయకుడు’తో మరో హార్డ్ హిట్టింగ్ టెర్రిఫిక్ సినిమా అందించారని ట్రైలర్ భరోసా ఇచ్చింది. తమిళ్ లో హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!