NTV Telugu Site icon

Nayakudu: రజినీ, కమల్ మెచ్చిన ‘నాయకుడు’..

Rajini

Rajini

Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు. ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. నాయకుడు పేరుతో ఈ సినిమా రేపు థియేటర్ లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ .. ఈ సినిమాపై రజినీకాంత్, కమల్ హాసన్ చేసిన ట్వీట్స్ ను అభిమానులతో పంచుకుంది. సినిమా చాలా బావుందని వారు ప్రశంసించిన ట్వీట్స్ ను నాయకుడు పోస్టర్ కు ఎటాచ్ చేసి ట్వీట్ చేసింది.

Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్

“మామన్నన్.. సమానత్వాన్ని మారి సెల్వరాజ్ ఈ సినిమా ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. అద్భుతమైన నటన కనబరిచిన వడివేలు, ఉదయనిధి, ఫహద్ ఫాసిల్‌లకు నా అభినందనలు” అని రజినీ చెప్పగా.. ” నా అభిప్రాయంలో అందరు మనుషులు సమానమే. మామన్నన్.. నా అబిప్రాయానికి ధైర్యాన్ని ఇచ్చింది. చిత్ర బృందానికి నా అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్స్ ను షేర్ చేస్తూ.. ” లెజెండ్స్‌ను మంత్రముగ్ధులను చేసి, తమిళనాడులో వారి హృదయపూర్వక ప్రశంసలను గెలుచుకున్న చిత్రం మామన్నన్.. రేపటి నుండి నాయకుడుగా తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.