Nawazuddin Siddiqui Reveals a boat incident in Saindhav Shooting: విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘రాంగ్ యూసేజ్ కి, ట్రైలర్ కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘సైంధవ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ మాలిక్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ఒక బోట్ రైడింగ్ సీక్వెన్స్ ఉంటుందని అన్నారు.
RC 16: అన్నట్టే రెహమాన్ ను దింపారు… ఇక రచ్చ రచ్చే!
ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తాను బోట్ డ్రైవింగ్ చేస్తుంటే పెద్ద అల వచ్చిందని ఆ దెబ్బకి తాను బోట్ నుంచి గాల్లోకి ఎగిరిపోయాను అని వెల్లడించాడు. ఆ సమయంలో యూనిట్ వేరే పడవల్లో ఉండి షూట్ చేస్తున్నారని అన్నారు. గాల్లోకి ఎగిరాక ఇక అయిపొయింది అనుకున్నా దేవుడి దయవల్ల మళ్ళీ అదే బోట్ మీద వెళ్లి కూర్చున్నట్టు పడ్డానని అన్నారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నిజానికి తనకు తెలుగు నుంచి సౌత్ నుంచి కూడా అవకాశాలు వస్తాయి కానీ పాత్ర నచ్చితేనే తాను సినిమా ఒప్పుకుంటానని అన్నారు. ఇక ఈ సినిమాతో తనకి పర్ఫెక్ట్ లాంచింగ్ దక్కిందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయితే ఆనందించేవాడిని కానీ అది చేయడం చేయకపోవడం నిర్మాత ఇష్టం కదా అని ఆయన చెప్పుకొచ్చారు.