Nawazuddin Siddiqui: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క నటుడు కూడా మూస ధోరణిలో కొనసాగాలనుకోవడం లేదు. నేను హీరోను ఇలాంటి పాత్రలే చేస్తా అంటూ మడికట్టుకొని కూర్చుకొవడం లేదు. డిఫరెంట్ .. డిఫరెంట్ పాత్రలను ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను ఇస్తున్నారు. నటుడు అంటే.. ఎలాంటి పాత్రలు అయినా చేయగలడు అని నిరూపిస్తున్నారు. ఇక ప్రయోగాలకు అయితే కొంతమంది నటులు పెట్టి పుట్టారు అని చెప్పొచ్చు. అందులో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకడు. బాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో సిద్దిఖీ ఒకడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ నటుడు.. తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు నవాజుద్దీన్. మొట్టమొదటిసారి ఆయన ఒక హిజ్రా పాత్రలో నటిస్తున్నాడు.
SKN: మెగా ఫ్యాన్సే చిరంజీవిని తొక్కేస్తున్నారు.. SKN సంచలన వ్యాఖ్యలు
నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హడ్డీ. లింగమార్పిడి చేయించుకున్న ఒక హిజ్రా రివెంజ్ ను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక హిజ్రాగా సిద్దిఖీ నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలకు గురైన అతను లింగమార్పిడి చేయించుకొని హిజ్రాగా మారతాడు. వీరందరికి అమ్మ అనే ఒక ఆమె ఉంటుంది. కొంతమంది రాజకీయ నేతలు తమ పదవిని దక్కించుకోవడానికి ఆమెను చంపేస్తారు. ఇక అమ్మను చంపిన వారిపై పగతీర్చుకోవడానికి హిజ్రాగా ఉన్న సిద్దిఖీ ఏం చేశాడు,.. ? అనేది కథగా తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఇందులో విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7 న జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ప్రయోగం ఈ విలక్షణ నటుడుకు ఎలాంటి హిట్ ను అందివ్వనుందో చూడాలి.