న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికీ. భారీ అంచనాల మధ్య జూన్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని అభిమానులను నిరాశపరిచింది. నాని నటన బావున్నా ల్యాగ్ ఎక్కువ ఉందని, కొన్ని సీస్ ను కట్ చేస్తే బావుంటుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోకుండా చిత్ర బృందం తమ సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నది.. ఇక ఈ వేడుకలో నాని ఈ విషయాల గురించి మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమా అట్టర్ ప్లాప్ అని అంటున్నవారికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “అంటే సుందరానికి టీమ్ అందరికీ థాంక్స్. అందరం కలిసి ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ క్రియేట్ చేయగలిగినందుకు. అందరు అంటున్నారు మూడు రోజులకే సక్సెస్ సెలబ్రేషన్స్ ఏంటి అని.. ఈరోజు మేము సెలబ్రేషన్స్ చేసుకుంటుంది నంబర్స్ ను కాదు, హార్ట్స్ ను.. మా సినిమాకి ఎంత ప్రేమ దక్కింది, చూసిన వాళ్ళకి ఎంత ఎంజాయ్ వచ్చింది అనే దానికి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవునా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ సినిమా చూసిన వారి కళ్లలో ఆనందం వచ్చిన విషయంలో మేము ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టేసాం. చాలా అరుదుగా వస్తాయి మంచి సినిమాలు. అందులో ‘అంటే సుందరానికి’ ఒకటి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా వారికీ ఒక విషయం చెప్తున్నాను. కొత్తగా ట్రై చేసినప్పుడు ఒక మాస్ మూవీ తో కంపేర్ చేయడం, కలెక్షన్స్ ఎందుకు రాలేదు అని అడగడం కాదు.. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వారి భుజాల మీద ఎత్తుకొని దానిని ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో మనం అందరం భాగం అవుతాం. ఇది అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. ఇది మన విజయం.. రేపు ఈ సినిమా ఎక్కడికి వెళ్తోంది.. బాక్సాఫీస్ ను రీచ్ అవుతుంది లేదు ఇవన్నీ ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. ఇక ఒక పదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో గొప్ప గొప్ప సినిమాలో అంటే సుందరానికీ ఒకటి ఉంటుంది అని చెప్తున్నాను. ఇలాంటి కథలు చెప్పడానికి గట్స్ కావాలి. అవి మా వివేక్ లో ఉన్నాయి. ఇది ఆవకాయ లాంటి సినిమా.. రోజు రోజుకు ఈ సినిమా ఊరుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నాని వ్యాఖ్యలపై నెటిజన్స్ ఏమంటారో చూడాలి.