జెర్సీ సినిమాలో నాని చేసిన ఎమోషనల్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ట్రాక్ సూపర్బ్ గా ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్ ని మరోసారి క్రియేట్ చెయ్యబోతున్నాడు నాని. తన నెక్స్ట్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ కాకుండా… ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే క్యూట్ ఎమోషన్స్ ని నాని చూపించబోతున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్ అవుతుండడంతో న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా గురించిన అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నాని, ఒక పాపతో కూర్చోని ‘నాని 30’ గురించిన డీటైల్స్ ని చాలా ఇంటరెస్టింగ్ గా చెప్పాడు.
గడ్డంతో ఉండను, మీసాలు ఉంచను, జుట్టు మాత్రమే ఉంచుతాను అని తన లుక్ గురించి హింట్ ఇచ్చిన నాని… తన కూతురు ఎవరు కోరుకుంటే వాళ్లు సినిమాలో భాగం అయ్యి ఉంటారని చెప్తూనే… ‘నాని 30’ కాస్ట్ అండ్ క్రూని రివీల్ చేశాడు. హీరోయిన్ గా ‘సీతా రామం’ ఫేమ్ ‘మృణాల్ ఠాకూర్’ నటిస్తున్న ఈ సినిమాని ‘శౌర్యువ్’ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని కూతురి పాత్రలో ‘బాబే కియారా ఖన్నా’ నటిస్తుండగా, కన్నడ హిట్ సినిమా ‘హ్రిదయం’కి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘హీషం అబ్దుల్ వాహబ్’ ‘నాని 30’కి సంగీతం అందిస్తున్నాడు. నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమాకి బ్యుటిఫుల్ విజువల్స్ ఇచ్చిన ‘సను వర్గీస్’ ‘నాని30’కి కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడ్యూస్ చేస్తోంది. మొత్తానికి ఒక కూల్ బ్రీజ్ లాంటి అనౌన్స్మెంట్ వీడియోతో నాని, ఆడియన్స్ దృష్టిని ‘నాని 30’పైకి షిఫ్ట్ చేశాడు.
This year will be most special 🙂
Dasara will grab you and #Nani30 will hug you.🤗
Promise.
Wish you all a very happy new yearHere’s the glimpse
– https://t.co/EiG701Ohxp@mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @editorpraveen @mohan8998 @drteegala9 #MurthyKalagara pic.twitter.com/dTraabL8kL
— Nani (@NameisNani) January 1, 2023