బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఎప్పటికీ గోప్యంగానే ఉంచుకుంటుంది. కానీ ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్‌లో ఆమె పెళ్లి రహస్యం వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం దర్శకురాలు ఫరా ఖాన్ వేసిన సరదా కామెంట్. ఆ ఈవెంట్‌కు నర్గీస్‌తో పాటు ఆమె సన్నిహితుడు టోనీ బేగ్ కూడా హాజరయ్యాడు. రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ఫరా ఖాన్, టోనీని ఉద్దేశించి..
Also Read : Pawan Singh : సజీవదహనమే దిక్కు అంటూ..ఊహించని షాక్ ఇచ్చిన పవన్ సింగ్ భార్య జ్యోతి
‘టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు’ అని చెప్పింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంటే నర్గీస్ – టోనీ పెళ్లి చేసుకున్నారని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని అందరికీ స్పష్టమైంది. సమాచారం ప్రకారం, 2025 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో వీరిద్దరూ నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. తర్వాత స్విట్జర్లాండ్‌లో హనీమూన్‌కి కూడా వెళ్లారు. కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి నర్గీస్ ఎక్కడ స్పందించకపోవడం, ఫోటోలు పంచుకోక పోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. కొంతమంది ఇది ప్రైవసీని కాపాడుకోవడమే అని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ’అంత ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకోక పోవడం ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌లో రాక్‌స్టార్ సినిమాతో అడుగుపెట్టి తొలి సినిమాతోనే స్టార్‌డమ్ అందుకున్న నర్గీస్ ప్రజెంట్ బారీ ప్రాజెక్ట్ లలో బీజి గా ఉంది.