ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి బిటౌన్ ప్రేక్షకులకు బాగా తెలుసు. 2011లో రొమాంటిక్ డ్రామా “రాక్‌స్టార్”తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. తరువాత పొలిటికల్ థ్రిల్లర్ “మద్రాస్ కేఫ్”లో కూడా కనిపించింది. కమర్షియల్ హిట్లుగా నిలిచిన కామెడీ ఎంటర్టైనర్ హిందీ చిత్రాలు “మెయిన్ తేరా హీరో”, “గూఢచారి”, “హౌస్‌ఫుల్”లలో నటించింది. నర్గీస్ ఫక్రి కొన్ని పనులు చేయకపోవడం వల్లనే ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిందట. బాలీవుడ్‌లో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆమె కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.
Read Also : మహేష్, పవన్ కాంబినేషన్ సెట్ అవుతోందా ?
నర్గిస్ తనకంటూ కొన్ని నియమ నిబంధనలు, సరిహద్దులు గీసుకుందట. సినిమా ఇండస్ట్రీలో పేరు కోసం, లేదా అవకాశాలను పొందడం కోసం నేక్డ్ గా కన్పించడం, దర్శకనిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వడం వంటి పనులు చేయలేదట. ఈ కారణంగానే తనకు అవకాశాలు తగ్గాయంటోంది ఈ భామ. నర్గీస్ ఫక్రి తాను ఫేమ్ కోసం అత్యాశతో లేనని, అందువల్ల ఏ దర్శకుడి లైంగిక డిమాండ్లకు తలొగ్గలేదని వెల్లడించింది. మోడలింగ్ లో కూడా కొన్నిసార్లు ఆమెను టాప్ లెస్ షాట్ లు చేయమని, యాడ్లలో సూపర్ నేకెడ్ గా కంపించమని అడిగారట. కానీ తనకు అలా చేయడం ఇష్టం ఉండదని, పైగా సౌకర్యంగా కూడా అన్పించిందని చెప్పుకొచ్చింది.