ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి బిటౌన్ ప్రేక్షకులకు బాగా తెలుసు. 2011లో రొమాంటిక్ డ్రామా “రాక్‌స్టార్”తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. తరువాత పొలిటికల్ థ్రిల్లర్ “మద్రాస్ కేఫ్”లో కూడా కనిపించింది. కమర్షియల్ హిట్లుగా నిలిచిన కామెడీ ఎంటర్టైనర్ హిందీ చిత్రాలు “మెయిన్ తేరా హీరో”, “గూఢచారి”, “హౌస్‌ఫుల్”లలో నటించింది. నర్గీస్ ఫక్రి కొన్ని పనులు చేయకపోవడం వల్లనే ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిందట.…