Ramya Raghupathi: ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఏది అంటే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ నాలుగో పెళ్లి చేసుకోవడమే. కొత్త ఏడాది.. ఈ ముదురు జంట లిప్ లాక్ తో తమ పెళ్లి వార్తను అధికారికం చేశారు. ఇక దీంతో పవిత్రా లోకేష్ కాస్తా పవిత్రా నరేష్ గా మారింది. నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతికి అతను ఇంకా విడాకులు ఇవ్వలేదు. అయినా నాలుగో పెళ్ళికి సిద్దమయ్యాడు.పవిత్రా కారణంగా నరేష్, రమ్య మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు ఘాటైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. పవిత్రా, నరేష్ ఒక హోటల్ లో అడ్డంగా బుక్ అయిన రోజు నరేష్, ప్రెస్ మీట్ పెట్టి మరీ రమ్య గురించి ఆరోపణలు చేశాడు. ఆమెకు భర్త అంటే లెక్కలేదని, ఆమెకు నా ప్రాణాలు, ఆస్తి కావాలని, పెద్దలను పట్టించుకోదని చెప్పుకొచ్చాడు. ఎన్నోసార్లు ఆమెను మార్చాలని ప్రయత్నించినా ఆమెలో మార్పు రాలేదని, నా ఆస్తికోసం నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తోందని అన్నాడు. వాటికి ఆధారాలుగా ఎన్నో డాక్యుమెంట్లను కూడా చూపించాడు.
Read Also: Cm Jaganmohan Reddy: విద్యాశాఖపై జగన్ సమీక్ష.. నాణ్యత విషయంలో రాజీ వద్దు
ఇక నరేష్ వ్యాఖ్యలను రమ్య ఖండించింది. నరేష్ నీచుడు అని, తనతో అతను ఎంత దారుణంగా ప్రవర్తించాడో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య నరేష్ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. విడాకులలో మనీ మ్యాటర్ లేదని తన భర్త తనతోనే ఉండాలని తాను కోరానని చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకుని మరో మహిళతో సెటిల్ కావాలని నరేష్ భావిస్తున్నాడని, అతను చేసిన అరాచకాలు అంతా ఇంతా కావని తెలిపింది. తనను ఎంతగానో వేధించాడని, డ్రైవర్ తో ఎఫైర్ ఉందని, రాఖీ కట్టిన అన్నతో ఎఫైర్ ఉందని అనుమానించి వేధించేవాడని చెప్పుకొచ్చింది. నరేష్ కు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నానని తెలిపిన రమ్య.. నరేష్ తప్పు చేసి ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెబుతాడని, ఏడుస్తాడని కాళ్లు పట్టుకుంటాడని చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికి తన కొడుకుకు డివోర్స్ అనే మాట తెలియదని, నాన్న వేరే పెళ్లి చేసుకుంటున్నాడా..? అని తనను వచ్చి అడుగుతున్నాడని తెలిపి కంటనీరు పెట్టుకుంది. ప్రస్తుతం రమ్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also: Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్