Naresh:రోజురోజుకు సీనియర్ నటుడు నరేష్- పవిత్ర వివాదం ముదిరిపోతోంది. ఈ ఏడాది మొదట్లో నరేష్, తాను పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు లిప్ లాక్ ఇస్తూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఈ విషయం బయటికి రావడంతోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నరేష్ బండారాన్ని బయటపెట్టింది. అతడు ఒక ఉమనైజర్ అని, తనను విడాకులు ఇవ్వమని వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. దానికోసం చాలామందితో ఎఫైర్ అంటకట్టాడని, తాను బతికి ఉండగా వారిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తాను అని శపథం చేసింది. అంతేకాకుండా తన కొడుకు కోసమే అతనితో ఉండడానికి ఒప్పుకున్నానని చెప్పింది. ఇక ఈ వ్యాఖ్యలపై నరేష్ స్పందించాడు. తన కొడుకును తనవద్దకు పంపించాలంటూ కోర్టులో కేసు వేశాడు. తన కొడుకుకు పర్మనెంట్ గార్డియన్ గా తననే నియమించాలని నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఇక ఈ సందర్భంగా నరేష్ తన మూడో భార్య రమ్యపై ఘాటు ఆరోపణలు చేశాడు. రమ్య రఘుపతి వల్ల తన కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందని పిటిషన్ లో చెప్పుకొచ్చాడు. “రమ్యతో ఉంటే నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతోంది. ఆస్తికోసం భర్తనే చంపాలనుకున్న రమ్య దగ్గర నా కొడుకును ఉంచొద్దు. నా కొడుకును అడ్డుపెట్టుకొని ఆస్తికాజేయచేయడానికి అడ్డదారులు తొక్కుతుంది. రమ్య లాంటి ఫ్రాడ్ దగ్గర నా కొడుకు పెరగటం మంచిది కాదు. ఫైనాన్షియల్ స్కాములు చేసే రమ్య దగ్గర నా కొడుకు ఉండటం ప్రమాదకరం.. నా కొడుకు నా దగ్గరే ఉండడమే శ్రేయస్కరం. నా కొడుకు నన్ను హీరోలా చూస్తాడు. నా మీద లేనిపోనివి అతడికి చెప్పి నా నుంచి దూరం చేయాలనీ చూస్తోంది. నా కొడుకు చదువు కోసం సంవత్సరానికి నాలుగు లక్షలు ఖర్చు పెడుతున్నాను. అతడికి మంచి భవిష్యత్తును అందిస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.