Naresh Pavithra Lokesh Got Married: అవును.. కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబుతున్నామని చెప్పిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోని ట్విటర్ మాధ్యమంగా నరేష్ పంచుకున్నారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముడ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ పవిత్ర నరేష్’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా.. కేవలం కొందరు సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది.
German Church Shooting: జర్మనీ చర్చిలో కాల్పులు.. పలువురు మృతి, కొందరికి గాయాలు
కాగా.. సినిమాల సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం, కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. కొన్నాళ్లు సీక్రెట్‌గానే తమ ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ జంట.. ఆ తర్వాత బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని బట్టబయలు చేసింది. ఆమధ్య బెంగళూరు హోటల్‌లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు.. నరేష్ మూడో భార్య రమ్య పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. ఇక అప్పటినుంచే నరేశ్, పవిత్ర వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల పాటు ఈ జంట గురించే చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే తాము ఒక్కటవ్వబోతున్నామని షాకిచ్చిన వీళ్లిద్దరు.. అందరు బాగుండాలి అందులో మేముండాలని చెప్తూ ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది.
Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
https://twitter.com/ItsActorNaresh/status/1634067504384606210?s=20