Dasara 2 Pre-Production to Begin soon: నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత ఏడాది మార్చి నెలలో విడుదలయి సూపర్ హిట్ సాధించింది. ఇక సినిమా చివరిలో సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు ఆ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. దసరా 2 సినిమాకి సంబంధించిన పనులను ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
Seshu Passes Away: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ కన్నుమూత
ఇక శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ సిద్ధం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవిని డైరెక్టు చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆయన దసరా 2 మీదనే శ్రీకాంత్ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. దసరా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం అనగానే ప్రేక్షకులలో సాధారణంగానే అంచనాలు ఏర్పడుతాయి. ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత ధరణి అండ్ కో ఊరిలో అడుగుపెట్టి ఇంకా తాగుడు వల్ల ఊరి కుర్ర కారు ఇబ్బంది పడుతున్నారని తెలిసి అక్కడ ఉన్న బార్ ని తగలబెడతాడు ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది? రెండో భాగంలో దీన్ని లైన్ గా తీసుకోబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.