Tamil Lollu Sabha fame Actor Seshu passes away due to cardiac arrest: ప్రముఖ హాస్యనటుడు లక్ష్మీ నారాయణన్ శేషు అలియాస్ లొల్లు సభ శేషు కన్నుమూశారు. విజయ్ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ‘లొల్లు సభ’ షో ద్వారా ఫేమస్ అయిన శేషు కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన వయసు 60 కాగా ఆయనకు ముగ్గురు కొడుకులు. శేషు స్మాల్ స్క్రీన్‌పై పాపులర్ కామెడీ షో లొల్లు సభతో మంచి ఫేమస్ అయ్యారు.
Nawazuddin Siddiqui: అంత రచ్చ చేసి విడాకులన్నారు.. ఇప్పుడు మళ్ళీ లవ్వేంటి బాసూ?
ఆ తర్వాత బుల్లితెరపై అరంగేట్రం చేశాడు. అంతేకాక నటుడు ధనుష్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘తుళ్లువదో ఉలహా’తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఈ మధ్య కాలంలో సంతానం సినిమాల్లోన తన కామెడీతో ఎందరో అభిమానులను నవ్వించాడు. సంతానం కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘వడకుపట్టి రామసామి’లో శేషు పాత్ర ఎంతగానో చర్చనీయాంశమైంది. ఇక ఆరోగ్యం విషమించడంతో మార్చి 15న చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన శేషు చికిత్సకు స్పందించక మృతి చెందాడు. ఆయన మృతి సినీ పరిశ్రమకు చెందిన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. డికిలోనా, A1, పారిస్ జయరాజ్ వంటి అనేక సినిమాల్లో కూడా ఆయన నటించారు. సుమారు ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించిన శేషు, కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేశాడు.