అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ‘అంటే సుందరానికి’ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా నాని స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ సినిమానే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి దసరా డైరెక్టర్‌తో ‘రా’ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట నాని. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నానిని సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి శ్రీకాంత్ ఓదెలతో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట నాని. ఈ సినిమా కథ కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు. దాంతో మరోసారి ధరణిలా చాలా రఫ్‌గా కనిపించబోతున్నాడట నాని. మరి ఈసారి ఈ ‘రా’ కాంబినేషన్ ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.