The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ లోని ‘ఆయా షేర్’** పాట చూస్తుంటే సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఆ రంగుల వెనుక వేలాది మంది కార్మికుల చెమట, కళా దర్శకుల సృజనాత్మకత ఉంటుందనేది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ సృష్టించిన లోకం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ పాటలో హీరోను ‘మురికివాడల చక్రవర్తి’గా చూపించడానికి మేకర్స్ ఏకంగా 2.5 ఎకరాల్లో ఒక భారీ సామ్రాజ్యాన్నే నిర్మించారు. ముఖ్యంగా ‘హీరో హౌస్’ (కమాన్ సెట్) ఈ పాటకే హైలైట్, 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ కట్టడం చూస్తుంటే ఒక ప్యాలెస్‌ను తలపిస్తుంది. 25 మంది కార్మికులు రాత్రింబవళ్లు దాదాపు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను సిద్ధం చేశారు. ఇది సహజంగా కనిపించడం కోసం వాడిన ‘ఏజింగ్ టెక్నిక్స్’ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిభకు అద్దం పడుతున్నాయి.
Also Read:Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?
Also Read
సాధారణంగా సినిమాల్లో ఇళ్లలా కనిపించే డమ్మీ కట్టడాలను వాడుతుంటారు. కానీ, ‘ది ప్యారడైజ్’ టీమ్ మాత్రం ఏకంగా 60 ఇళ్లతో ఒక గ్రామాన్నే సృష్టించింది, 600 మంది ఒకేసారి ఉండగలిగేలా తీర్చిదిద్దిన ఈ సెట్ కోసం 100 ట్యాంకర్ల నీటిని వాడటం విశేషం, 2.5 ఎకరాల విస్తీర్ణంలో 30 రోజుల పాటు 50 మంది పనివారు పడ్డ కష్టం ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కాపర్ ఫినిష్ బిర్యానీ బౌల్ ని 10 అడుగుల వెడల్పుతో పాతకాలపు రాగి పాత్రలా కనిపించేలా దీనిని ఐదు రోజుల్లోనే అద్భుతంగా తీర్చిదిద్దారు. మురికివాడలోని సహజత్వాన్ని తీసుకురావడానికి 120 అడుగుల పొడవుతో ఒక భారీ డంప్ యార్డ్‌ను రీ-క్రియేట్ చేశారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సెట్ కోసం నెల రోజుల పాటు 25 మంది టీమ్ పనిచేశారు. “ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా, ఉన్న పరిసరాల్లోనే సహజ సిద్ధమైన రంగులు, అల్లికలతో ఈ సెట్లను నిర్మించడం మా ఆర్ట్ డిపార్ట్మెంట్ సాధించిన గొప్ప విజయం.” అని చిత్ర యూనిట్ చెబుతోంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!