Nani: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. SLV సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నెందు ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” ఈ ఈవెంట్ కు ఒక గెస్ట్ గా రాలేదు.. రవి అన్న గురించి మాట్లాడే ఒక అవకాశం వస్తుందని వచ్చాను. రవి అన్నకు చిరంజీవి గారంటే ఇష్టం.. రవి అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారిని చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యారో.. మా జనరేషన్ లో మాకు రవి అన్న ఒక ఉదాహరణ. ప్రతి జనరేషన్ కు ఒకడుంటాడు.. నేను అయ్యాను.. నువ్వెందుకు అవ్వకూడదు అని దైర్యం ఇచ్చేవాడు.. మేము ఎదుగుతున్న సమయంలో మా అందరికి అది రవి అన్న.. ఇందాక చిరంజీవి క్యార్ వ్యాన్ లోకి రవి అన్న వెళ్లే షాట్ చూసి అనిపించింది.. త్వరలో మీ క్యార్ వ్యాన్ లోకి నేను అలా ఎంటర్ అవ్వాలని.. త్వరలో అవుతోంది.
ప్రతి సినిమా రిలీజ్ తరువాత ఫోన్ చేస్తాడు నాకు.. ఆయన చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక మంచి సినిమా తీసిన టీమ్ ను, నటులను ఎంకరేజ్ చేయాలి.. అది బాధ్యతగా ఫీల్ అవుతాడు రవి అన్న.. ఆ మాటల్లో ఉండే లవ్ ను నేను ఫీల్ అవుతాను. సినిమా నచ్చకపోతే చేయొద్దు అన్నా.. కానీ సినిమా నచ్చితే మాత్రం చెయ్.. ఎందుకంటే.. అది నా రోజును మార్చేస్తుంది. రామారావు ఆన్ డ్యూటీ పై నాకు మంచి పాజిటివ్ ఫీల్ ఉంది మొదటి నుంచి.. దసరా సినిమా చేసేది కూడా ఈ నిర్మాతలే.. మంచి సినిమాను ఇవ్వడంలో వారు ఎప్పుడు వెనుకాడరు. వేణు గారు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందం.. హనుమాన్ జంక్షన్ లో వేణు గారిది, ఎల్బీ శ్రీరామ్ గారి కామెడీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా మంచి విజయం అందుకొని మీరు మరిన్ని సినిమాల్లో చేయాలనీ కోరుకుంటున్నాను. చివరికి రవి అన్న.. ఇన్నేళ్ల నుంచి బ్యాక్ తో బ్యాక్ సినిమాలు చేస్తూ సినిమా షూటింగ్ ఉంటూనే రోజు గడిచే చాలా ఫ్యామిలీస్ కు రవన్న ఎంత చేశాడో మాటల్లో చెప్పలేను. 20 ఏళ్ల నుంచి రవితేజ ఆన్ డ్యూటీ.. 29 న రామారావు ఆన్ డ్యూటీ” అంటూ నాని చెప్పుకొచ్చాడు.