Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న హాయ్ నాన్న ప్రమోషన్స్ లో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ ..”వైజాగ్ కు నాకు స్పెషల్ అనుబంధం ఉంది. పిల్లనిచ్చారు అని కాదు కానీ, నా సినిమా ప్రతిదీ హిట్ అయినా ప్లాప్ అయినా ఎక్కడ ఆగిపోయినా వైజాగ్లో మాత్రం ఆడుతూనే ఉంటుంది. అందుకే నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఇక డిసెంబర్ సినిమాల విషయానికొస్తే అన్ని సినిమాలు విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నాను.
Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్
ప్రభాస్ సలార్ తో పాటు నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. సుమ కొడుకు రోషన్ నటించిన బబుల్ గమ్.. అలాగే నాకెంతో ఇష్టమైన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ.. ఇలా అన్ని సినిమాలు డిసెంబర్ లో వస్తున్నాయి. అవన్నీ మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇక హాయ్ నాన్న సినిమా విషయానికొస్తే.. ఇది తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం ఉంటుంది. నిజంగా చెప్తున్నా.. ఇది ఏడిపించే సినిమా అయితే కాదు. మీరు వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్తారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. డిసెంబర్ 7 న అందరూ థియేటర్ కు వచ్చి సినిమా చూడండి” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.