Nani: పవన్ డైరెక్టర్ తో నాని.. ఇదిక్కడి కాంబోరా మావా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: న్యాచురల్ స్టార్ నాని కోసం టాలీవుడ్ కుర్ర డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దసరా సినిమాతో మాస్ ను చూపించిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ ను చూపించి అభిమానులను అలరించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకోవడంతో.. నాని లైనప్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం నాని.. సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు కారణం.. వివేక్ ఆత్రేయ- నాని కాంబోలో ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవకపోయినా విమర్శలు ప్రశంసలను అందుకుంది. దీంతో ఈసారి ఈ కాంబో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ చిత్రం తరువాత నాని.. బలగం వేణుతో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజమో కాదో ఇంకా తెలియదు. ఇంకోపక్క దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. నానితో మరో సినిమా చేయడానికి ఆరాటపడుతున్నాడు. ఇక ఇవే ఇంకా ఫైనల్ కాలేదు. ఒక కొత్త కాంబో ఫైనల్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ తో OG ని తెరకెక్కిస్తున్న కుర్ర డైరెక్టర్ సుజీత్.. నానితో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. అది కూడా OG నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండడం విశేషం. OG పూర్తయ్యాకా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందని తెలుస్తోంది. ఆలోపు నాని.. సరిపోదా శనివారం ను ఫినిష్ చేయనున్నాడట. సుజీత్ టేకింగ్ కు నాని న్యాచురల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి ఈ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Tags
- #OG
- Nani
- Sujeeth
- Tollywood News
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!