Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన క్లాస్ హీరో. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉండేది. అలాంటి నాని రూటు మార్చేశాడు. ఏ హీరో అయినా లాంగరన్ లో స్టార్ డమ్ పెంచుకోవాలంటే కచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. మాస్ హీరో అనే ముద్ర పడాల్సిందే. ఆ విషయం నానికి కూడా తెలుసు. అందుకే క్లాస్ నుంచి మాస్ రూట్ కు టర్న్ అయిపోయాడు.
Read Also : SS Rajamouli: మహేష్ బాబు అభిమానులకు అంతుపట్టని రాజమౌళి స్ట్రాటజీ
దసరా సినిమా నుంచే మాస్ లోకి వచ్చేశాడు. మొదటి ప్రయత్నం సక్సెస్ అయింది. దసరా పెద్ద హిట్ అయి నాని రూట్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వత మధ్యలో కొన్ని క్లాస్ సినిమాలు చేశాడు. కానీ అవి నానికి అంతగా కలిసిరాలేదు. దీంతో మళ్లీ మసా రూట్ కు ఎక్కేశాడు. సరిపోదా శనివారంతో మళ్లీ మాస్ హిట్ అందుకున్నాడు. తాజాగా హిట్-3తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీని తర్వాత కూడా భారీ మాస్ సినిమానే చేస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో మళ్లీ మాస్ యాంగిల్ లోనే వస్తున్నాడు నాని. ఇలా వరుసగా మాస్ రూట్ లో సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకుంటున్నాడు.
Read Also : Trivikram Srinivas : సిరివెన్నెల రాసిన ఆ పాటనే అన్నింటికంటే గొప్పది : త్రివిక్రమ్