ప్రేమ కథా చిత్రాల్లో నటించడం అంత ఈజీ కాదు. ఏజ్ పెరిగే కొద్దీ ప్రేమ కథల్లో నటించడం అందరికీ సాధ్యం కాదు కానీ ఈ విషయంలో నాని పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. చాలా నేచురల్ గా, పర్ఫెక్ట్ ప్రేమికుడిగా కనిపించడంలో నాని దిట్ట. లవర్ బాయ్ గా నానిని ఎన్ని సినిమాల్లో అయినా చూడొచ్చు, స్టిల్ బోర్ కొట్టకుండా కొట్టగానే కనిపిస్తాడు. నిజానికి దసరా సినిమాకి ముందు నాని వేరు, వంద కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత నాని వేరు. ఆ రేంజ్ హిట్ కొట్టిన తర్వాత ఎవరైనా మళ్లీ మాస్ సినిమా చేయాలి అనుకుంటారు కానీ మాత్రం కథని నమ్మి మరోసారి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో నాని ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని ఉబెర్ కూల్ గా కనిపించాడు. కెమెరా పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్న నాని సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
మాములుగా అయితే ఏ హీరోకి అయినా ఇదేమి టైటిల్ అనిపిస్తుంది కానీ పోస్టర్ పైన నాని కనిపించగానే ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ కొత్తగా అనిపించడం మొదలయ్యింది. ఒక పాపకి తండ్రిగా నాని నటిస్తున్నాడు కానీ ‘హాయ్ నాన్న’ అంటుంది మాత్రం నాని కాందండోయ్ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రేమగా నానిని ‘హాయ్ నాన్న’ అని పిలుస్తుంది, అందుకే అదే టైటిల్ అయ్యింది. గ్లిమ్ప్స్ లో మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. గ్లిమ్ప్స్ మధ్యలో నాని టైట్ క్లోజ్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అది ఒక్కటి చాలు… ఈ జనరేషన్ చూసిన నేచురల్ యాక్టర్ నాని మాత్రమే అని చెప్పేయొచ్చు. సెటిల్డ్ ఎమోషన్ ని కూడా కన్విక్షన్ తో పండించడం నానికి మాత్రమే చెల్లింది. ఇక గ్లిమ్ప్స్ ఎండ్ అయ్యే టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ బిట్ సాంగ్ రిపీట్ మోడ్ లో వినేలా ఉంది. జెర్సీ, నిన్ను కోరి వైబ్స్ ని మైంటైన్ చేస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమా నానికి పాన్ ఇండియా రేంజులో హిట్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 21న నాని ప్రేమ కథతో ఏ స్థాయి హిట్ కొడతాడో చూడాలి.
She calls me that…
Not the little one 😉Glimpsehttps://t.co/oY0v1h84Ms pic.twitter.com/KrU3U8kaPS
— Nani (@NameisNani) July 13, 2023