RRR: టాలీవుడ్ గురించి ఎవరికైన చెప్పాలంటే అంతకుముందు బాహుబలికి ముందు.. బాహుబలికి తరువాత అని చెప్పేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ కు ముందు ఆర్ఆర్ఆర్ తరువాత అని చెప్తున్నారు. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇండియా.. ముఖ్యంగా టాలీవుడ్ పేరును మారుమ్రోగేలా చేస్తోంది. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతఏడాది మార్చిలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఇక్కడ ప్రభంజనాలు సృష్టించిన విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా 42 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు మరియు 114 కేంద్రాల్లో షిప్ట్ పద్దతిలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అప్పట్లో అదో పెద్ద రికార్డ్.. ఇక్కడ చాలా సినిమాలు 50 రోజులు కూడా ఆడడం లేదు. కానీ, మన తెలుగు సినిమా.. జపాన్ లో కూడా వంద రోజులు పూర్తిచేసుకుంది.
Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి
నిజం.. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తిచేసుకొంది. ఇంకా థియేటర్ లో సందడి చేస్తోంది. ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడంలో కూడా ఆర్ఆర్ఆర్ ముందు వరుస లో ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టినట్లు చరిత్ర లేదు.. అలాంటింది.. ఒక తెలుగు సినిమా జపాన్ లో 100 రోజులు ఆడడం అంటే మాటలు కాదు. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగా ఆస్కార్ నామినేషన్స్ ను కూడా మన నాటు నాటు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సాంగ్ ఆస్కార్ ను కొట్టుకొస్తే ఇక టాలీవుడ్ పేరు ఆస్కార్ లో మారుమ్రోగినట్టే..