Nandamuri Balakrishna: మాస్ కా దాస్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే.. లైఫ్ మొత్తం వారిని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే అంటారు.. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని. తాజాగా బాలయ్య.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి సెట్ లో బాలయ్య మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్నీ విశ్వక్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
“GOG సెట్ లో మన బాలయ్య సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మీ అద్భుతమైన సపోర్ట్ కు చాలా చాలా థాంక్స్ సర్. ఎప్పుడు నేను మిమల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీ రాకతో మా చిత్రబృందంలో మరింత జోష్ పెరిగింది. దురదృష్టవశాత్తూ నా పూర్తి చిత్రాలను అప్‌లోడ్ చేయడం సాధ్యపడలేదు. ఎందుకంటే సినిమాలోని లుక్ రివీల్ అవుతుంది కాబట్టి.. ఆ పనిచేయలేకపోయాను. సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా నా ఫుల్ పిక్చర్స్ రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఫ్రేమ్ లా ఉన్న బాలయ్య బాబు చాలు.. ఫైర్ అంతే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మొదటినుంచి కూడా విశ్వక్ కు బాలయ్య మంచి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి కాంబోలో ఒక షో రావాలని అభిమానుకు చెప్పుకొస్తున్నారు.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లకు గుడ్‌బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!