NBK 108: బాలయ్య దిగుతుండు… సంబరాలకు సిద్ధంకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాలని ఇచ్చిన బాలయ్య, హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న అనీల్ రావిపూడితో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ బజ్ ఉంది. గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనీల్ రావిపూడి మాట్లాడుతూ “NBK 108లో బాలయ్య టచ్ ఉంటుంది కాకపోతే ఈసారి సింహం సీమలో కాదు తెలంగాణాలో దిగుతుంది” అని చెప్పాడు. ఎప్పుడూ సీమ యాసలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పే బాలయ్య నుంచి తెలంగాణా యాసలో పవర్ ఫుల్ డైలాగులు వినబోతున్నాం అనే విషయం కొత్తగా ఉంది. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలకి సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, NBK 108కి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో ఈ మూవీ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి లోటు ఉండదని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. NBK 108 మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
కాజల్ అగర్వాల్, బాలయ్య కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ మూవీతో కాజల్ అగర్వాల్ గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వలనుకుంటుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీలా కూడా NBK 108 సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్… రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందుతున్న NBK 108 సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయడానికి మేకర్స్, జూన్ 10ని ముహూర్తంగా పెట్టుకున్నారు. బాలయ్య బర్త్ డే రోజున NBK 108 నుంచి సర్వప్రయిజ్ రాబోతుంది. సెలబ్రేట్ NBK లైక్ నెవర్ బిఫోర్ అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. మరి అన్న దిగుతుండు అంటూ వచ్చిన ఈ అప్డేట్ టీజర్ గురించా? టైటిల్ అనౌన్స్మెంట్ గురించా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అన్న దిగుతుండు 😎
Team #NBK108 is gearing up to celebrate #NBKLikeNeverBefore on his birthday 💥
Bombarding Updates Loading Soon🥁
Stay hyped for his Arrival🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/lVDOM3Kjdx
— Shine Screens (@Shine_Screens) June 3, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!