Nandamuri Balakrishna: నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు.. అన్న బాలయ్య ఆనందం..
- నారా భువనేశ్వరి లండన్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులు..
- తన సోదరికి అభినందనలు తెలిపిన హీరో నందమూరి బాలకృష్ణ..
- ఈ అవార్డులు మాకు, తెలుగు ప్రజలకు గర్వకారణం..
- భువనేశ్వరి చెల్లెలు దూరదృష్టి, కృషి, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న సేవా భావానికి..
- అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం మనందరికీ ఆదర్శం, ప్రేరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి లండన్‌లోని మే ఫెయిర్ హోటల్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇక, తన చెల్లి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే, నట సింహ నందమూరి బాలకృష్ణ.. సమాజ సేవలో చూపిన దృఢమైన నిబద్ధత, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను స్పర్శించిన మానవతా దృష్టికి గుర్తింపుగా ఈ అవార్డులు మాకు, తెలుగు ప్రజలకు గర్వకారణం అని హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “భువనేశ్వరి చెల్లెలు దూరదృష్టి, కృషి, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న సేవా భావం కోసం అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవాలు మనందరికీ ఆదర్శం, ప్రేరణగా ఉంటాయి” అని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు భువనేశ్వరి సేవాస్ఫూర్తి, నాయకత్వ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు హీరో నందమూరి బాలకృష్ణ.. కాగా, లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవం లభించింది..
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!