Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nana Patekar Slap Incident : సినిమాల్లో మనం చూసే కొన్ని ఎమోషన్స్ నిజంగా నటనతో వచ్చాయా? లేక ఆ క్షణంలో నటులు నిజంగానే ఆ ఎమోషన్స్ ను పండిస్తారా ? అనే ప్రశ్నలు మన మెదడులో తొలుస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ప్రముఖ నటి మధు షా. దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఒకప్పుడు ప్రముఖ నటుడు నానా పటేకర్‌తో కలిసి పనిచేసిన సమయంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన తన నటనా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కూడా వెల్లడించారు.
‘ఫూల్ ఔర్ కాంటే’, ‘రోజా’, ‘జెంటిల్మన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మధు షా ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా 1997లో విడుదలైన ‘యశ్వంత్’ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఆ సినిమాలో ఆమె నానా పటేకర్‌తో కలిసి కీలక పాత్రలో నటించారు. అదే సినిమా సమయంలో తాను మెథడ్ యాక్టింగ్ అసలు అర్థం ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు.
Also Read
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
- Drishyam 3 Hindi Version : 'దృశ్యం 3' హిందీ వెర్షన్ లో భారీ మార్పులు... రీజన్ ఇదేనా ?
- Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి... చేసేదంతా దర్శకులే... 'పెద్ది' వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
- NTRNEEL : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ఒక ఎమోషన్ సన్నివేశం కోసం ఇద్దరూ షూటింగ్‌కు సిద్ధమయ్యారని, ఆ సీన్లో కన్నీళ్లు రావాల్సి ఉండటంతో గ్లిజరిన్ ఉపయోగించాలని అనుకున్నారని మధు తెలిపారు. అయితే నానా పటేకర్ మాత్రం గ్లిజరిన్ అవసరం లేదని, ఎమోషన్ ని అనుభవిస్తే సహజంగానే కన్నీళ్లు వస్తాయని సూచించారట. అయితే ఆ క్షణంలో తనకు కన్నీళ్ళు రావాల్సిన ఎమోషన్ రాకపోవడంతో సీన్ ఆశించిన విధంగా ముందుకు సాగలేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
అప్పుడు అనూహ్యంగా జరిగిన ఒక చర్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. రిహార్సల్స్‌లో ఎప్పుడూ చేయని విధంగా నానా పటేకర్ ఒక్కసారిగా తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టారని మధు తెలిపారు. ఆ సంఘటనతో తాను తీవ్రంగా షాక్‌కు గురయ్యానని, అంతేకాదు చాలా కోపం కూడా వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తాను కూడా నానా పటేకర్‌కు తిరిగి చెంపదెబ్బ కొట్టానని వెల్లడించారు.
ఆ సన్నివేశంలో ఇద్దరి మధ్య జరిగినది పూర్తిగా సహజమైనవి కావడంతో, తెరపై కనిపించిన ఎమోషన్ కూడా రియాలిటీగా నిలిచాయని ఆమె వివరించారు. ఆ సీన్ పూర్తయ్యాక ఆ రోజు షూటింగ్ కూడా ముగిసిపోయిందని చెప్పారు. అయితే ఆ సంఘటన తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని మధు అభిప్రాయపడ్డారు. నటన అంటే డైలాగులు చెప్పడం కాదని, పాత్రలో పూర్తిగా లీనమవ్వడం కూడా అంతే ముఖ్యమని అప్పుడే అర్థమైందన్నారు.
నానా పటేకర్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సహజ నటనకు పేరుగాంచిన నటుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. పాత్ర కోసం పూర్తిగా మారిపోవడం, ఎమోషన్స్ ను రియాలిటీగా పండించడం ఆయన ప్రత్యేకతగా చెబుతారు. అలాంటి నటుడితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతో నేర్పిందని మధు షా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూడా ‘యశ్వంత్’ షూటింగ్లో జరిగిన ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, తన నటనా జీవితంలో అది మరచిపోలేని అనుభవంగా నిలిచిపోయిందని ఆమె వెల్లడించారు.
- Tags
- cinema
తాజావార్తలు
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!