Upasana : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ‘నేను చరణ్ ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరం బాగా సపోర్టు చేసుకుంటాం. అందుకే మా బంధం బలంగా ఉంటుంది. నేను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు చరణ్ నా వెంటే ఉన్నాడు. అనేక విషయాల్లో నాకు సపోర్టు చేస్తున్నాడు. నాకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం. నేను మా గ్రాండ్ పేరెంట్స్ వద్దనే పెరిగాను. నా కూతురు కూడా వాళ్ల నానమ్మ, తాతయ్య వద్ద పెరగాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపింది.
Read Also : Renu Desai : రాజకీయాల్లోకి రావాలని ఉంది.. రేణూ దేశాయ్ సంచలనం
‘నానమ్మ, తాతయ్యల వద్ద పెరగడం గొప్ప అనుభూతి. మా మావయ్య, అత్తయ్య వాళ్ల మనవరాలిని బాగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు మంచి చేతుల్లో తనను పెడుతున్నాను అనే నమ్మకం నాకుంది. నాకు మావయ్య, అత్తయ్యలతో ఉండటం అంటేనే ఇష్టం. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేవు. కానీ నాకు మాత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండటమే ఇష్టం. అప్పుడే సంతోషంగా అనిపిస్తుంది. చరణ్, నేను వారానికి ఒక రోజు ఇంట్లోనే ఉంటాం. ఆ రోజు ఫోన్, ల్యాప్ ట్యాప్ లకు దూరంగా ఉంటాం. లైఫ్ లో వచ్చే కష్టాలపై మాట్లాడుకుంటాం. ఈ రోజుల్లో ఇలా మాట్లాడుకోవడం చాలా అవసరం’ అంటూ తెలిపింది ఉపాసన.