నాగ శౌర్య తదుపరి చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్. చిరంజీవి, రామ్ చరణ్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’ విడుదల కానున్న ఏప్రిల్ 29 కి ఓ వారం ముందు ‘కృష్ణ వ్రింద విహారి’ని విడుదల చేస్తుండటం విశేషం.
Read Also : Music ‘N’ Play: బాలు స్మృతితో హరిణి, సాయిచరణ్ శివరాత్రి స్పెషల్!
ఇది తమ సినిమా మీద నాగశౌర్య, దర్శకనిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తోంది. ఇక రిలీజ్ డేట్ తో విడుదల చేసిన పోస్టర్ లో నాగ శౌర్య బజాజ్ చేతక్ పై బొట్టు పెట్టుకుని వెనుక షిర్లీ సెటియాతో కలిసి వస్తున్న వైనాన్ని గమనించవచ్చు. పోస్టర్‌లో ఇద్దరు సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాకు మహతి సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.