బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం ప్రసారమైన అంశాలు ఆసక్తిని కలిగించాయి. యాంగర్ మేనేజ్ మెంట్ లో సన్నీ ఫెయిల్ అవుతున్నాడని బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు చెప్పారు. దాంతో అతని మెడలో ‘గిల్టీ’ అనే బోర్డ్ ను వేసి, శనివారం అంతా ఉంచుకోవాలని నాగార్జున చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ ‘నాలోని ఈ ఆవేశానికి మీరే కారణం. ‘రక్షకుడు’ సినిమాలోని మీ క్యారెక్టరే నాది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున…. ‘ఆ సినిమా రిజల్డ్ ఏమిటో నీకు తెలుసు కదా!’ అంటూ నవ్వేశాడు. ఆవేశం కరెక్ట్ కాదని, పైగా ఎదుటి వారిని దూషించడం తప్పని నాగార్జున హితవు పలికాడు. కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో కూడా సన్నీకి తెలియదని, దానిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నడని రవి ఆరోపించాడు. దాన్ని అంగీకరించడానికి కూడా సన్నీ సిద్ధంగా లేని విషయాన్ని నాగార్జున తప్పు పట్టాడు.
Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్
బిబి హోటల్ టాస్క్ లో కస్టమర్ గా అద్భుతమైన కామెడీని పండించిన సన్నీ, ఆ తర్వాత టాస్క్ లో మాట తూలడంతో అందరికీ టార్గెట్ అయ్యాడని, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. ఇదే సమయంలో శనివారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో సన్నీ సేవ్ అయ్యాడు. అలానే… బిగ్ బాస్ ఆదేశం కోసం కేక్ ను ఎవరూ తినకుండా ఉండటాన్ని కూడా నాగార్జున తప్పు పట్టాడు. అర్హత ఉంది అనుకున్న వాళ్ళు వెంటనే కేక్ తినేయాల్సిందని, అనవసరంగా ఓవర్ థింకింగ్ చేసి, బుర్రలు పాడు చేసుకోవద్దని, ఈ విషయంలో సన్నీ కేక్ తిని మంచి పనిచేశాడని అతన్ని నాగార్జున కితాబిచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ సభ్యులు సన్నీని టార్గెట్ చేసినా, అతను ఎలిమినేషన్ నుండి సేవ్ కావడం, కేక్ విషయంలోనూ అతని నిర్ణయం కరెక్ట్ కావడంతో ఫైనల్ గా సన్నీకి మోరల్ గా బోలెడంత బూస్టప్ లభించినట్టు అయ్యింది!