సెప్టెంబర్ 20న టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో పంచెకట్టుతో కన్పించిన నాగార్జున “మై హీరో, మై ఇన్స్పిరేషన్…” అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు.
Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ
“సెప్టెంబర్ 20న నాకు చాలా ముఖ్యమైన రోజు. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచె కట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా చూస్తుంటే చాలా ముచ్చటేసేది. అందులోనూ పుందూర్ ఖద్దరు అంటే చాలా ఇష్టం. ఇది ఆయన నవరత్నాల హారం, ఇది ఆయన నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్… ఇదిప్పుడు నా ఫేవరేట్. ఇవన్నీ నాతో ఉంటే ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుంది. ఏదో తృప్తి… నాన్న గారి పంచె కట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ మా ప్రయత్నం ఏఎన్నార్ లిప్స్ ఆన్” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు నాగార్జున. “బంగార్రాజు”లో నాగార్జున తన తండ్రి ఏఎన్ఆర్కి ఇష్టమైన ఈ గెటప్ లోనే కనిపించనున్నారు.
Remembering dear Nana! My hero!! My inspiration!! #ANRLivesOn pic.twitter.com/CgHKCLwObY
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2021