ఆ విషయంలో సమంతనే ఫాలో అవుతున్న నాగ చైతన్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అందరి చూపు ఓటిటీల మీదే పడింది. ఎంచక్కా ఇంటి దగ్గరే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకప్రేక్షకుల అభిరుచి మేరకు స్టార్స్ సైతం ఓటిటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోహీరోయిన్లందరు ఓటిటీకి పరిచయమయ్యారు. సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో హిట్ అందుకొంది. ఇక సామ్ బాటలోనే చైతూ సైతం ఓటిటీ బాట పట్టాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చైతన్య ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ఓటిటీ కోసమని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవల చైతూ ఈ వార్తలపై స్పందిస్తూ ” ఒక హర్రర్ కథాంశంతో వస్తున్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాను. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, అందులోను హర్రర్ కధాంశం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని.. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు కూడా.. కానీ, పాత్ర నచ్చడంతో దీనికి ఒప్పుకున్నాను. అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న ఈ సిరీస్‌కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది” అని చెప్పుకొచ్చాడు. అయితే చైతూ కు మొదటి నుంచి హర్రర్ కథలంటే భయమని, ఆ భయంతోనే సమంత, నాగార్జున నటించిన ‘రాజుగారి గది 2’ కూడా చూడలేదని అప్పట్లో సామ్ తెలిపింది. మరి ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి చైతూ ప్రయత్నిస్తున్నాడా..? లేక తనలో కొత్త మార్పులు వచ్చాయని తెలుపుతున్నాడా ..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ విషయంలో మాత్రం చై, సామ్ ని ఫాలో అవుతున్నాడన్న మాట మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది.
Also Read
- NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
- AR Rahman: ఇక మీదట నా అన్ని సినిమాలు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్: బుచ్చిబాబు
- Rahman: కార్ తీసుకొని స్టూడియోకి వెళ్లేసరికి మూడ్ పోతుంది!
- Peddi: 'పెద్ది' సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!