Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు. చాలా సార్లు తన అన్న, తమ్ముడి మీద వచ్చే విమర్శలకు ధీటైన సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక తాజాగా మరోసారి నాగబాబు తన వాక్చాతుర్యాన్ని చూపించాడు. నేడు అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు, చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. గరికపాటి ప్రసంగం జరుగుతుండగా ఇటుపక్క చిరంజీవి తన ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. ఇక దానివలన డిస్టర్బ్ అయిన గరికపాటి చిరుపై ఫైర్ అయ్యారు.
“అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతాను.. లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేమి మొహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి అక్కడ ఫోటోలు ఆపేసి ఈ పక్కకు రండి.. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి.. ఆ ఫోటో సెషన్ ఆపేసి ఇటు రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి”అంటూ కొంచెం ఆగ్రహంగానే చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాటలకు గౌరవం ఇచ్చిన చిరు.. ఫోటో సెషన్ లను ఆపేసి గరికపాటి దగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పారు. ఇక అన్నపై గరికపాటి కోపం ప్రదర్శించడం తమ్ముడు నాగబాబుకు నచ్చలేదేమో గరికపాటికి సీట్ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. “ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..”అంటూ రాసుకొచ్చాడు. అంటే చిరు చుట్టూ అంతమంది ఫోటోలు దిగుతుండడం వలన గరికపాటి డిస్టర్బ్ అవ్వడం వెనుక అసూయ ఉందని చెప్పుకొచ్చాడన్న మాట. తాను ఒక పక్క ప్రసంగం చెప్తూంటే వినకుండా ప్రజలు చిరు వెనుక ఫోటోల కోసం పరిగెడుతున్నారని, అది కొంచెం గరికపాటికి కన్నుకుట్టినట్లు ఉందని, అందుకే ఆ అసూయను ఆగ్రహంగా చూపించారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగబాబు ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నాగబాబు ట్వీట్ పై గరికపాటి ఏ రేంజ్ లో సెటైర్లు విసురుతారో చూడాలి.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022