HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..

  • పవన్ కల్యాణ్ కొత్తగా ఉంటారు
  • ఆ ఎనర్జీ వేరే లెవల్
  • నాగవంశీ ట్వీట్ వైరల్
Nagavamsi

Nagavamsi

HHVM : పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జులై 24న రాబోతున్న సినిమా ట్రైలర్ ను జులై 3న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనిపై పెద్ద ట్వీట్ వేశాడు. జులై 3న ఫ్యాన్స్ ఓ సర్ ప్రైజ్ చూడబోతున్నారని తెలిపాడు. పవన్ కల్యాణ్‌ గారు ఫైర్ గా కనిపించబోతున్నారని.. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ తెలిపాడు.

read also : Kubera : పదేళ్లకే అన్నీ తెలుస్తున్నాయ్.. శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్

పవన్ కల్యాణ్‌ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ట్రైలర్ లోనే కనిపిస్తాయి. పవన్ కల్యాణ్‌ గారిని ఎప్పుడూ చూడని విధంగా మీరు చూడబోతున్నారు. ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. ట్రైలర్ తో మీకు ఒక సర్ ప్రైజ్ కనిపిస్తుంది అంటూ హైప్ ఇచ్చాడు నాగవంశీ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారీ పీరియాడికల్ మూవీగా వస్తున్న వీరమల్లును డైరెక్టర్ క్రిష్‌, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇప్పటికే వరుసగా వాయిదా పడుతూ వచ్చింది సినిమా. దాదాపు ఐదేళ్లుగా సినిమా పెండింగ్ లోనే ఉండిపోయింది. అందుకే మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు పెంచుతారో చూడాలి.

read also : Sriram Venu: ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథ.. ట్రెండ్ ఫాలో అవుతున్నాం!