నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసిన యూనిట్, శనివారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా పూజాహెగ్డే హాజరవటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ (చినబాబు), నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య,…