కొంత మంది హీరోలు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్పటికీ..డిజాస్టర్ లోనే ఉండిపోతారు. అలాంటి టాలెంటెడ్ హీరోలో నాగ శౌర్య ఒకరు. కెరీర్ ఆరంభం నుండి,మంచి మంచి లవ్ స్టోరీలతో లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శౌర్య.. ఒక గట్టి హిట్ మాత్రం కొట్టడం లేదు .ఇక తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు.
ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ, నాగ శౌర్య బర్త్ డే ట్రీట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
రామ్ దేశిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు.ఇక ఈ రోజు నాగశౌర్య పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను అధికారికంగా రిలీజ్ చేసింది. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగశౌర్య కొత్తగా కనిపించాడు.. చేతులకు రక్తం కారుతుండగా, నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఇక పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం టైటిల్ ద్వారా కొంత అర్ధం అవుతుంది. మరి ఈ సారి అయిన హిట్ అందుకుంటాడో చూడాలి.