Akkineni Naga chaitanya: నాగార్జునకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ప్రవీణ్ సత్తారు కు థాంక్స్ చెప్పాడు నాగ చైతన్య, నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో నిర్వహించారు. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ” నాన్నను మేము ఎలా చూడాలనుకున్నామో ప్రవీణ్ సత్తారు అలా చూపించాడు. ఒక యాక్షన్ మోడీ లో చాలా స్టైలిష్ గా కనిపించేలా చేశారని చెప్పుకొచ్చాడు. కర్నూల్ కు తాను రావడం ఇదే మొదటిసారి అని చెప్పిన చై ఒక మాస్ సినిమా కర్నూల్ ప్రేక్షకులకు నచ్చినట్లు పడితే సౌండ్ ఏంటో తమకు హైదరాబాద్ లో వినిపిస్తోందని తెలిపాడు. తాను వారంలో మూడు నాలుగు సార్లైనా నాన్నను కలుస్తానని, ఎప్పుడు కలిసినా సినిమాలు, బిగ్ బాస్ గురించి చెప్పుకొచ్చేవారు కానీ నాలుగైదు నెలలుగా ఘోస్ట్ సినిమా గురించే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక చాలా రోజుల తరువాత నాగ్ లో ఇలాంటి ఆతృతను గమనించానని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ చూసి బంగార్రాజు నుంచి ఘోస్ట్ గా నాన్న ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్ అని, ప్రవీణ్ కట్ చేసిన టీజర్ కు, ట్రైలర్ కు ఒక కాన్సెప్ట్ ఉందని, అది తనకు బాగా నచ్చిందని తెలిపాడు. చిత్ర బృందానికి, నిర్మాతలకు థాంక్స్ చెప్పిన చైతూ ఈసారి కర్నూల్ థియేటర్లో స్క్రీన్ అన్ని చిరిగిపోతాయని, ఆ తరువాత తమ్ముడు అఖిల్ ఏజెంట్ తో థియేటర్లు బద్దలైపోతాయని చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 5 న ఈ సినిమాను అందరు థియేటర్లో చూడాలని కోరుతూ ముగించాడు.