Naga Chiatanya: అక్కినేని నాగచైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ “మీ అందరికి థాంక్స్ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మీరే గెస్టులు. నేను ఓక్ యాక్టర్ అవ్వడానికి కారణం తాతగారిని చూసి, నాన్న గారిని చూసి స్ఫూర్తి పొందాను. కానీ నేను ఈరోజు మనస్ఫూర్తిగా సినిమాను ప్రేమించి చేస్తున్నాను అంటే అది మీ వలనే. మీకు మంచి సినిమాలు ఇవ్వడమే నా గోల్. ఇకనుంచి ప్రతి సినిమాకు నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మీకు మంచి సినిమా ఇవ్వడానికి. మీ ఎనర్జీ ప్రతిసారి చూస్తూ ఉంటే నా కేరాఫ్ అడ్రెస్స్ అభిమానులే అని కాన్ఫిడెంట్ అని గర్వంగా చెప్పుకుంటాను. అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు అని ఈ సినిమాలో డైలాగ్ ఉంది.. ఆ డైలాగ్ గుర్తొచ్చినప్పుడు నాకు వైజాగ్ గుర్తొచ్చింది.
నాకు సక్సెస్ ఇచ్చిన ప్రతి సినిమా వైజాగ్ లో జరిగింది. నేను వైజాగ్ ను ఎప్పటికి మర్చిపోలేను. ఇక సినిమా విషయానికొస్తే థాంక్యూ.. కొన్ని సినిమాల గురించి కథగా చెప్పొచ్చు.. కానీ కథగా ఎంత చెప్పుకున్నా అది థియేటర్లో చూసాకే.. ఆ మూమెంట్స్ ఫీల్ అయ్యాకే మనలందరిని టచ్ చేస్తుంది. థాంక్యూ అలాంటి సినిమా.. థాంక్యూ అనే పదం ఎన్నోసార్లు వాడుతుంటాం.. నిజంగా ఈ సినిమా చేశాకే నాకు థాంక్యూ అసలైన మీనింగ్ ఏంటో నాకు తెల్సింది. థాంక్యూ చెప్పే విషయంలో సిగ్గు పడకండి.. నేను చెప్తున్నాను అందరికి థాంక్స్. థాంక్యూ జర్నీ తీసుకొచ్చినందుకు విక్రమ్ కు థాంక్స్ చెప్తున్నాను. ఇంత బంగారం లాంటి సినిమాలో నేను భాగమైనందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. థమన్, పీసీ శ్రీరామ్,ఎడిటర్స్, రాశీఖన్నా, అవికా, మాళవికా అందరికీ థాంక్స్. జూలై 22 న తప్పకుండ సినిమాను థియేటర్లో చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు.