అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫుల్ జోష్‌లో సాగుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు చిత్రీకరణ జరగనుండగా, అవి ప్రేక్షకులకు కొత్త రికార్డుల అనుభూతిని ఇస్తాయని సినిమా టీమ్ తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సాహు గారపాటి ఇటీవల ఇంటర్వ్యూలో, అక్టోబర్ 5 నుంచి నిర్వహించబోయే మరో షెడ్యూల్‌లో వెంకటేశ్ భాగం కానుందని వెల్లడించారు.
Also Read : Theater : సింగల్ స్క్రీన్ థియేటర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..
అంటే వచ్చే ఏడాది చిరంజీవి వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కోసం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విడుదల కాబోతున్నది, వేసవిలో మరోసారి ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘విశ్వంభర’ ను వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో అధికంగా VFXను ఉపయోగించి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను బలపరుస్తున్నారు. మరోవైపు, ‘మన శంకర వరప్రసాద్‌గారు కూడా కంటీన్యూగా షెడ్యూల్ జరుపుకుంటుంది. మొత్తానికి చిరంజీవి ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.