Naga Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ ప్రయోగాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈసారి ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా.. నాగబాబు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు. ఇక నాగబాబు స్పీచ్ తో స్టేడియం దద్దరిల్లింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరును నాగబాబు ప్రస్తావించడంతో స్టేడియం మొత్తం కళ్యాణ్ బాబు పేరుతో మోతమోగిపోయింది. ఇక ఆ అరుపులు విన్న నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అరవండి.. మీ అరుపులు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి..నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ ని మీట్ అయ్యి వస్తున్నాను. ఇంకా మీ ఎనర్జీ అంత దాచుకుని ఈ ఇయర్ 2024 లో రాబోతున్న జనరల్ ఎలెక్షన్స్ లో మీ సత్తా చూపించండి. ఆర్మీ వాళ్ళలాగా, మిలిటరీ వాళ్ళలాగా గన్స్ కి ఎదురువెళ్లాల్సిన అవసరం లేదు. చేతిలో ఒక ముద్ర ఉంటుంది గుద్దండి దాని మీద” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కు అన్న కోసమో.. కొడుకు కోసమో.. డైరెక్టర్ కోసమో రాలేదని, ఇండియన్ ఆర్మీ కోసం వచ్చినట్లు తెలిపాడు. ఇంట్లో తన తల్లి రోజు కొడుకులు బావుండాలి, మిగతా తల్లుల బిడ్డలు బావుండాలి అని కోరుకుంటూనే.. దేశం కోసంపోరాడుతున్న ప్రతి కొడుకు కూడా బావుండాలి అని కోరుకుంటుంది. అది చూసి తనకు సిగ్గేసిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నాగబాబు ఇండియా ఆర్మీ గొప్పతనం, వాళ్ళు సాధించిన కొన్ని ఘనతలని గుర్తుచేశాడు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ తమ భర్తలని కోల్పోయిన వీరనారీమణులకు 6 లక్షల విరాళం ప్రకటించాడు. దాన్ని ఈ మొత్తాన్ని చిత్ర దర్శకుడు, వరుణ్ తేజ్, నిర్మాత వెళ్లి వారికి అందించాలని నాగబాబు కోరాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.