టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక్కసారి ఓ హీరో నచ్చితే గుండెల్లో పెట్టేసుకుంటారు. అది బాలీవుడ్ హీరో అయినా కోలీవుడ్ హీరో అయినా. ఆ కోవకే వస్తాడు ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే, రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్‌తో టాలీవుడ్‌కు యాడెప్టెడ్ సన్ ఫ్రం అనదర్ వుడ్ అయిపోయాడు. రీసెంట్లీ డ్రాగన్‌తో సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ధనుష్. ఈ సినిమాను తమిళ తంబీలే కాదు తెలుగు ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేశారు.
Also Read : VenkyAnil 3 : 50 రోజులు పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎన్ని సెంటర్స్ అంటే.?
ప్రజెంట్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ చేస్తున్నాడు ప్రదీప్. కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఎల్ఐకెలో ఎస్ జే సూర్య, యోగి బాబు, మస్కిన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సైన్ ఫిక్సనల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నయనతార, లలిత్, విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు. మిడిలాఫ్ ది మంత్ లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ బైలింగ్వల్ మూవీకి కమిటయ్యాడు జూనియర్ ధనుష్. ఇప్పటికే సినిమా పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. త్వరలో టైటిల్ ఎనౌన్స్ చేయనున్నారు మేకర్స్. బైలింగ్వల్ మూవీగా రూపుదిద్దుకుంటుంది. లవ్ టుడే, డ్రాగన్ వంద కోట్లు క్లబ్‌లో చేరిపోవడంతో ఇప్పుడు ప్రదీప్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు డబులయ్యాయి. విఘ్నేశ్ సినిమా కూడా వంద కోట్ల మార్కెట్ ను అందుకుంటే హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా ప్రదీప్ రంగనాధ్ స్టార్ హీరోల సరసన చేరతాడు.