VNRTrio: భీష్మ కాంబో రిపీట్.. ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Movie Makers Announced VNRTrio Project: నితిన్, రశ్మికా మందణ్న, వెంకీ కుడుముల కాంబోలో గతంలో వచ్చిన ‘భీష్మ’ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సందేశం ఇస్తూనే.. ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూడా బాగానే కురిపించింది. ఇప్పుడు ఈ కాంబో మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టింది. ఉగాది పండుగ పర్వదినాన.. ఒక ఫన్నీ వీడియో ద్వారా ఈ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు కానీ.. #VNRTrio అనే హ్యాష్‌ట్యాగ్‌నే వర్కింగ్ టైటిల్‌గా కొనసాగిస్తున్నారు.
Bilkis Bano Plea: బిల్కిస్ బానో అభ్యర్థన.. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీం అంగీకారం
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
అసలు ఆ వీడియోలో ఏముందంటే.. మొదట నితిన్ ఎంట్రీ ఇస్తారు. ఇంకా ఎవరు రాలేదా? అని ఒకతడ్ని అడిగితే.. ఆల్రెడీ హీరోయిన్ వచ్చేసిందని చెప్తాడు. అప్పుడు రశ్మికా మందణ్ణ ఎంట్రీ ఇచ్చి.. నితిన్‌తో హిట్, ఫెయిల్యూర్‌పై ఫన్నీ చర్చ పెడుతుంది. వీళ్లిద్దరు మాట్లాడుతుండగానే.. జీవీ ప్రకాశ్ హీరో లెవెల్లో ఎంట్రీ ఇస్తాడు. తానే హీరో అనుకొని, ముఖానికి రంగులు పూసుకుంటుంటాడు. ఇంతలోనే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమేనని చెప్పేసరికి.. పాపం మనోడు డిజప్పాయింట్ అవుతాడు. ఆ నిరాశలోనే కోపంగా వెంకీ కుడుముల ఎక్కడ? అని అడగ్గా.. డైరెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. నేను ఆలస్యంగా వచ్చానా? అని వెంకీ అడగ్గా.. అందరూ నిట్టూర్పుగా చాలా ఆలస్యంగా వచ్చావని అంటారు. అయితే.. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పగానే, అందరూ హ్యాపీగా ఫీలై ఏ జోనర్? అని అడుగుతారు.
IND VS AUS: ఆలౌట్ అయిన ఆసీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..
ఛలో, భీష్మ స్థాయిలో ఉంటుందా? అని ప్రశ్నిస్తే.. కాదు ‘ఇది వేరే లెవెల్’ అని వెంకీ చెప్తాడు. అప్పుడే.. ఒక చిన్న గ్లిమ్స్ చూపించారు. అందులో ఒకరు బైక్ మీద వచ్చి, స్టైల్‌గా దిగి, ఒక బిల్డింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తారు. కానీ.. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. టైటిల్ ఏంటని అడగ్గా.. అన్నీ ఇప్పుడే చెప్తేస్తారా? ఒక్కొక్క డీటెయిల్ రివీల్ చేస్తానని వెంకీ చెప్పడంతో వీడియో ముగుస్తుంది. చూస్తుంటే.. ఈ సారి #VNRTrio డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
A trio so rare even we are aware!#VNRTrio is back with something more entertaining and more adventurous 💥💥
Watch now!
– https://t.co/UxHVoTh7KZMore details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/sbc8elnsPW
— Mythri Movie Makers (@MythriOfficial) March 22, 2023
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!