శ్రియా ‘మ్యూజిక్ స్కూల్’ ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందుతున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే, ఆయన అసోసియేట్ పాల్ సౌండెర్ ఇందులో భాగమవుతున్నారు.
Read Also : మెగా ఫ్యామిలీపై మోహన్ బాబు సెటైర్స్
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు పాపారావు మాట్లాడుతూ, ”నేటి విద్యావ్యవస్థలో సృజనాత్మకత లేకుండా పోతోంది. వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేయడమే లక్ష్యంగా విద్యను మూస పద్ధతుల్లో బోధిస్తున్నారు. దీనివల్ల పిల్లలలో తెలియని ఒత్తిడి నెలకుంటోంది. పిల్లలకు చదువే లోకమైపోతుంది. కళలు, ఆటలు కూడా జీవితంలో భాగమని ఈ చిత్రం ద్వారా తెలియచేయబోతున్నాం. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడం గొప్ప ప్రయాణంలా అనిపించింది. మ్యూజిక్, దానికి సంబంధించిన విజువల్స్‌ను ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని ఇస్తాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తిగా బ్రాడ్ వే మ్యూజికల్స్‌కు నేను ఆకర్షితుడినయ్యాను. మ్యూజిక్, డాన్స్ కొరియోగ్రఫీ కాంబినేషన్లో స్టోరి నెరేషన్ అనేది స్టోరీ లైన్‌ను చాలా బలంగా మార్చింది. ఈ సినిమాకు లెజెండ్రీ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించడమనేది గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు.

తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం