మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందుతున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.…