MM Keeravani: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధం అవుతోంది. 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగరంగా వైభవంగా చేయడానికి ప్రభుత్వాలు సన్నధం అయ్యాయి. ఇక ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే 2023 ను పురస్కరించుకొని పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ముగ్గురు ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉండడం గమనార్హం. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్‌కు పద్మశ్రీ పురస్కారం అందనుంది. ముఖ్యంగా అందులో జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇండియా పేరును నిలబెట్టిన సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఉండడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొని ఇండియా ఖ్యాతిని పెంచడమే కాకుండా ఆస్కార్ రేసులో తెలుగువారి పాటను నిలబెట్టిన సంగీత దర్శకుడు కీరవాణి.
సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలను టాలీవుడ్ కు అందించారు కీరవాణి. ఆయన సేవలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీతో గౌరవించనుంది. త్వరలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును అందుకోనున్నారు. కీరవాణి 1997లో ‘అన్నమయ్య’ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు. ఎనిమిది సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, మూడు సార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ నంది అవార్డులు పొందారు… ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి గా పద్మశ్రీ అవార్డు నిలువబోతోంది. విశేషం ఏమంటే ఆయన సోదరుడు రాజమౌళి ఇప్పటికీ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.