Music Director Koti: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Music Director Koti: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం నాడు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉంటాయి. ఇక తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడు అయిన రాజ్ మరణించిన వార్త తెలుసుకున్న కోటి కన్నీరు పెట్టేసుకున్నారు.
Naresh: నా ఆస్తి 1000 కోట్లు కంటే ఎక్కువే.. అంతా బ్లాక్.. ?
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది. రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను. రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు’ అని అన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..