ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా డిజిటల్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయిపోయాకా ప్రభాస్, ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. రాధే శ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు.
మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ ఏడాదిన్నర అవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో జరిగే కథని హను, ప్రభాస్ కోసం రాసాడట. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. టీమ్ ని కూడా ఫైనల్ చేస్తున్న హను, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్‌ను ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. అందుకే ఇప్పుడు… ప్రభాస్ సినిమాకు కూడా అతన్నే ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం… విశాల్ చంద్రశేఖర్‌కి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.